News February 8, 2025
VZM: జిల్లా ఎస్పీ దృష్టికి పోలీస్ సిబ్బంది సమస్యలు

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఎస్పీ పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని స్పష్టం చేశారు.
Similar News
News March 1, 2026
43 మందికి రూ.4.30 లక్షల జరిమానా: VZM SP

మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని విజయనగరం ఎస్పీ వెల్లడించారు.
News February 28, 2026
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు: కలెక్టర్

విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రావివలసలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. 3,280 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణ జరిగిందని, రబీ-ఖరీఫ్‌లలో మరింత సాగు పెంపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో భాగంగా ఫుడ్ పార్కులు, ఐటీ పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం భూములు గుర్తించినట్లు వివరించారు.
News February 28, 2026
సీఎం పర్యటన విజయవంతం: VZM కలెక్టర్

సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఘనంగా.. విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, జేసీ సేధు మాధవన్, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎటువంటి అసౌకర్యం లేకుండా పర్యటనను నిర్వహించామని పేర్కొన్నారు.


