News February 8, 2025

ఫుడ్ పాయిజనింగ్ జరగలేదు: కలెక్టర్

image

వై.రామవరం మండలం చవిటిదిబ్బలు కస్తూరిబా పాఠశాలలో ఎటువంటి ఫుడ్ పాయిజనింగ్, నీటి కాలుష్యం జరగలేదని కలెక్టర్ దినేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 14 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత అంటూ వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 14 మంది విద్యార్థినులకు వేరు వేరు కారణాల వల్ల జలుబు, జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిపారు.

Similar News

News April 19, 2026

జమ్మికుంట మార్కెట్ రేపు పున: ప్రారంభం

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ 3 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, నిన్న, నేడు సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ మూసి ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకొచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటలలోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2026

ఎన్టీఆర్: APCRDA అడిషనల్ కమిషనర్‌గా ధాత్రీ రెడ్డి.. నేపథ్యమిదే!

image

APCRDA అడిషనల్ కమిషనర్‌గా పెద్దిటి ధాత్రి రెడ్డిని నియమిస్తూ గత రాత్రి సిఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణ వాసి అయిన ఆమె 2020 IAS బ్యాచ్‌కు చెందినవారు కాగా ఏలూరు SP ప్రతాప్ శివకిశోర్‌(IPS)ను వివాహం చేసుకున్నారు. గతంలో పాడేరు సబ్ కలెక్టర్‌గా పనిచేసిన ధాత్రి రెడ్డి ప్రస్తుతం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) CEOగా పనిచేస్తున్నారు. తాజాగా APCRDA అడిషనల్ కమిషనర్‌గా నియమితులయ్యారు.

News April 19, 2026

విద్యుత్ సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ సీఎండీ

image

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు 86884 00499 నంబర్ ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.