News February 8, 2025
బాపట్ల: ‘గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి’

గ్రామాలలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ ప్రశాంత వాతావరణం సృష్టించాలని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ చెప్పారు. శుక్రవారం కర్లపాలెం మండలం హైదర్పేట గ్రామంలో ఆయన పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాలలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైనా పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు.
Similar News
News November 6, 2025
బెల్లంపల్లి: రైలు కింద పడి సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

బెల్లంపల్లి- రేచిని రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య గురువారం ఉదయం గుర్తుతెలియని రైలు కింద పడి కన్నాల బస్తీకి చెందిన సిలువేరు రవితేజ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహం విషయంలో కుటుంబ అంతర్గత కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 6, 2025
కృష్ణా: ఇకపై విజన్ యూనిట్‌లుగా సచివాలయాలు

గ్రామ/వార్డు సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్‌లుగా మారనున్నాయి. సచివాలయాల పేర్లు మారుస్తున్నట్లు గురువారం జరిగిన మంత్రులు, HODలు, సెక్రటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. జిల్లాలో 508 సచివాలయాలు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ విజన్ యూనిట్‌లుగా పని చేయనున్నాయి.
News November 6, 2025
పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్‌లో యువకుడి ఆత్మహత్య

కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన నీరటి రాజు (31) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం అలవాటు కారణంగా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయని, బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన రాజు గురువారం ఉదయం తిరిగొచ్చి ఇంట్లో ఉరివేసుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.


