News February 8, 2025

పార్వతీపురం: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు హాల్ టిక్కెట్లు సిద్ధం

image

పార్వతీపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్న విషయం తెలిసింది. వీరి హాల్ టికెట్లను కళాశాల లాగిన్ లోను, ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్లో పొందుపరిచామని పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి. మంజులవీణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

Similar News

News March 14, 2026

హనుమకొండ: ఇంటర్ పరీక్షకు 92% హాజరు నమోదు

image

జిల్లాలో నేడు నిర్వహించిన ఇంటర్ ఒకేషనల్ పరీక్షకు 92% హాజరు నమోదయింది. జిల్లాలో 905 మంది విద్యార్థులకు గాను 831 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 74 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.

News March 14, 2026

తిరుపతి: ఆందోళనలో మామిడి రైతులు

image

సాధారణంగా మార్చ్ నెలలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ ఏడాది వడగండ్లతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఈ నెల 17 నుంచి 20 వరకు వర్ష సూచన ఉంది. మామిడి పూత పుష్కలంగా ఉండే ఈ సమయంలో వర్షాలు పడితే మామిడి రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆందోళనలో పడ్డారు.

News March 14, 2026

రఘు భాయ్.. ది రియల్ హీరో

image

టీమ్ఇండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత నెట్టింట ఒకరి పేరు మారుమోగుతోంది. ఆయనే రాఘవేంద్ర (రఘు భాయ్). ఒకప్పుడు కేవలం ₹21తో ఇంటి నుంచి బయటకొచ్చి క్రికెట్ కోసం పోరాడిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. నెట్స్‌లో గంటకు 150 కి.మీ వేగంతో బంతులు విసిరి, మన బ్యాటర్లను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. అందుకే విరాట్ కోహ్లీ వంటి స్టార్లే ఆయనను టీమ్‌ఇండియాకు నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు.