News February 8, 2025
జనగామ: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను నాణ్యతతో చేయించాలని, ఈనెల 15లోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తిచేయాలని అదే విధంగా పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు.
Similar News
News March 3, 2026
పెద్దపల్లి: హోలీ స్పెషల్ ట్రైన్

హోలీ పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి – దానాపూర్ మధ్య ఈనెల 5 నుంచి 29 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రతీ ఆదివారం ఉదయం 10 గంటలకు చర్లపల్లిలో (03226) రైలు బయలుదేరుతుంది. ప్రతీ గురువారం రాత్రి 8:50 గంటలకు (03225) రైలు బయలుదేరుతుంది. ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి స్టేషన్‌లలో ఆగుతుందని, ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
News March 3, 2026
యుద్ధ ప్రభావం.. ఇరాన్‌లో 787 మంది మృతి

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల వల్ల ఇప్పటి వరకు 787 మంది మరణించినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ వెల్లడించింది. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్‌లోని కీలక సైనిక కేంద్రాలు, వ్యూహాత్మక స్థావరాలపై దాడులు కొనసాగుతుండటంతో ప్రాణనష్టం పెరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 1,000 మంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మరణించారు.
News March 3, 2026
270పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 270 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ట్రైనీ) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.47,330తో పాటు అలవెన్సులు చెల్లిస్తారు. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nclcil.in


