News February 8, 2025

కన్నాయిగూడెం: ఉర్సు ఉత్సవాలకు రావాలని సీతక్కకు ఆహ్వానం

image

కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో జరిగే ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు రావాలని స్థానిక ముస్లిం సోదరులు మంత్రి సీతక్కకు ఆహ్వాన పత్రిక అందజేశారు. నజీరుద్దీన్, మునీర్, షాయక్ మాట్లాడుతూ.. ఉర్సు షరీఫ్ ఉత్సవాలు జరిగే దర్గా వద్ద విద్యుత్ సరఫరా చేయాలని, దర్గా దగ్గరకు వెళ్లేందుకు నూతన రోడ్డు మంజూరు చేయాలని సీతక్కను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో అప్సర్ పాషా, గౌస్, అజ్జు పాల్గొన్నారు.

Similar News

News September 16, 2025

దసరా పండగకు పకడ్బందీ ఏర్పాట్లను చేయాలి: కలెక్టర్

image

బతుకమ్మ, దసరా పండుగలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి ఈ నెల 21 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా సంబరాలపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్ మండల ప్రత్యేక అధికారులు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News September 16, 2025

HYD: ఫిలిం మేకింగ్‌పై పట్టుందా..? గెలిస్తే రూ.3 లక్షలు!

image

HYDలో ప్రొడ్యూసర్ దిల్ రాజు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ పేరిట TFDC పోస్టర్ విడుదల చేశారు. సెప్టెంబర్ 30 వరకు 5 నిమిషాల షార్ట్ ఫిలిం, సాంగ్ వీడియో తీసి youngfilmmakerschallenge@gmail.com, 81258 34009 వాట్సప్‌కు పంపాలని చెప్పారు. మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండవ బహుమతి రూ.2 లక్షలు, మూడో బహుమతి రూ.లక్ష ఇస్తారు.

News September 16, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ గత 22 నెలల పాలన ప్రజా వ్యతిరేకమని విమర్శించారు. రేవంత్ రెడ్డి భయంతో HYD ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. నగరాభివృద్ధి కొనసాగాలంటే BRS మళ్లీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఉపఎన్నికలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్ నుంచి విజయయాత్రను ప్రారంభించాలని సూచించారు.