News February 8, 2025
బ్యాంకర్లు జిల్లా యంత్రాంగానికి సహకరించాలి: నంద్యాల కలెక్టర్

జిల్లా వృద్ధిరేటును గణనీయంగా పెంచేందుకు, రుణాలు అందించడంలో బ్యాంకర్లు జిల్లా యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో బ్యాంకు మేనేజర్ల జిల్లా ఓరియంటేషన్ వర్క్ షాప్‌కు జిల్లా కలెక్టర్ అతిథిగా పాల్గొన్నారు. రుణాలు అందజేసి పేదరిక నిర్మూలనకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.
Similar News
News November 5, 2025
ప్రగతినగర్: చెరువా.. కాలుష్య కర్మాగారమా?

స్థానిక అంబిర్ చెరువు కాలుష్య కర్మాగారంగా దర్శనమిస్తోంది. ఎంతో పురాతనమైన ఈ చెరువు కబ్జాలకు అడ్డాగా మారింది. చెరువు చుట్టూ చెత్తాచెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెరువులోని నీరు కూడా అంతే. ఒక వైపు ఉన్న మాంసం అంగళ్ల నిర్వాహకులు వ్యర్థ పదార్థాలను చెరువులో పడేస్తున్నారు. చెరువు పక్కగుండా వెళ్లాలంటే ముక్కలు మూసుకోవాల్సిందే. అధికారులు స్పందించి చెరువును రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
News November 5, 2025
నిజామాబాద్: సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో తాహెర్ బిన్ హందాన్

తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డికి శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయిలోకి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
News November 5, 2025
133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<


