News February 8, 2025
ఆశ్రమ పాటశాలల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్

జైనూర్ మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల పట్నాపూర్లో ఆకస్మికంగా పర్యటించారు. పాఠశాలను సందర్శించిన అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి.. పాఠశాలలో అన్ని రికార్డులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు సాదించేందుకు ఒక్క క్రమ పద్ధతిలో ప్రతీ ఒక్క సబ్జెక్టు తగు సమయం కేటాయించాలని సూచనలు చేశారు.
Similar News
News November 3, 2025
వనపర్తి: వర్షపాతం వివరాలు ఇలా..!

వనపర్తి జిల్లాలో 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో (ఆదివారం ఉదయం 8:30AM నుంచి సోమవారం ఉదయం 8:30AM) వరకు నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా అమరచింతలో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కానాయిపల్లి 1.3 మిల్లీమీటర్లు, విలియంకొండ 0.5 మిల్లీమీటర్లు, మిగతా 19 వర్షపాతం నమోదు కేంద్రాలలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News November 3, 2025
ఒకే రోజు ఐదుగురు గల్లంతు.. నలుగురి మృతి

జిల్లాలో ఆదివారం విషాదం నెలకొంది. ఇందుకూరుపేట(M) మైపాడు బీచ్లో ముగ్గురు <<18178820>>ఇంటర్ విద్యార్థులు<<>> మృతి చెందగా, <<18180051>>కావలి(M) <<>>తుమ్మలపెంటలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవలో నుంచి కిందపడి మరొకరు మృతి చెందారు. మరోవైపు ఆత్మకూరు పట్టణ సమీపంలోని చెరువులో సాయంత్రం నలిశెట్టి <<18180051>>మహేష్<<>> గల్లంతయ్యాడు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు.
News November 3, 2025
కరీంనగర్లో ‘మున్నూరుకాపు’ డామినేషన్

KNR రాజకీయాలలో మున్నూరుకాపు సామాజికవర్గం డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రిగా బండి సంజయ్ కుమార్, MLAగా గంగుల కమలాకర్ కొనసాగుతుండగా, తాజాగా జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లోనూ ఛైర్మన్గా అదే వర్గానికి చెందిన కర్ర రాజశేఖర్ గెలుపొందారు. 12 మంది డైరెక్టర్లలో ఏడుగురు కాపులే గెలవడం గమనార్హం. నిన్నటి వరకు KNR కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా చల్లా స్వరూప హరి శంకర్ కొనసాగారు.


