News February 8, 2025
‘స్కిల్ ఇండియా’కు రూ.8,800 కోట్లు
దేశంలోని యువతకు నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రారంభించిన ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని 2026 వరకు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. రూ.8,800 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం కౌశల్ వికాస్ యోజన 4.O, జన్ శిక్షణ్ సంస్థాన్, PM-NAPS పథకాలను భాగం చేసింది. అలాగే జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీ కాలాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించింది.
Similar News
News February 8, 2025
ముచ్చటగా మూడోసారా..? లేక 27 ఏళ్ల తర్వాత అధికారమా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో అక్కడి ఫలితంపై ఆసక్తి నెలకొంది. రాజధానిలో గడచిన 2సార్లూ ఆప్‌దే అధికారం. ముచ్చటగా మూడోసారీ గెలిచి అధికారంలోకి వస్తామని ఆప్ భావిస్తుంటే.. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీని ఈసారి చేజిక్కించుకుంటామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీవైపే మొగ్గు చూపుతున్నాయి. మరి ఢిల్లీ ఓటరు మనోగతం ఎలా ఉందో నేటి సాయంత్రం లోపు తేలనుంది.
News February 8, 2025
నేడే CCL ప్రారంభం.. గ్రౌండులో సత్తా చాటనున్న సినీ స్టార్లు
సెలబ్రిటి క్రికెట్ లీగ్(CCL) 11వ సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. మ.2 గంటలకు బెంగళూరు వేదికగా చెన్నై రైనోస్VSబెంగాల్ టైగర్స్, సా.6 గంటలకు తెలుగు వారియర్స్VSకర్ణాటక బుల్డోజర్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 2 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్లు బ్యాట్, బంతితో సత్తా చాటనున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో HYDలో నాలుగు మ్యాచులున్నాయి.
News February 8, 2025
రాహుల్ గాంధీతో నాకు విభేదాల్లేవు: సీఎం రేవంత్
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తనకు అగాథమేర్పడిందన్న వార్తల్ని సీఎం రేవంత్ కొట్టిపారేశారు. ఆయన తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘మధ్యప్రదేశ్ సభలో తెలంగాణ CM బాగా చేస్తున్నాడంటూ కొనియాడారు. కులగణనపై ఆయనతో చర్చిస్తూనే ఉన్నాం. ఆయన ఆమోదం లేకుండా చేస్తామా..? రాహుల్‌తో నా సాన్నిహిత్యం ఎలాంటిదో ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు.