News February 8, 2025

BPL-2025 విజేత ఫార్చూన్ బారిషల్

image

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఫైనల్‌లో చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత చిట్టగాంగ్ 194/3 స్కోర్ చేయగా బారిషల్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టుకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. విజేతకు రూ.2.50 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. BPLలో మొత్తం ఏడు టీమ్‌లు పాల్గొన్న విషయం తెలిసిందే.

Similar News

News February 8, 2025

రాహుల్‌ గాంధీతో నాకు విభేదాల్లేవు: సీఎం రేవంత్

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తనకు అగాథమేర్పడిందన్న వార్తల్ని సీఎం రేవంత్ కొట్టిపారేశారు. ఆయన తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘మధ్యప్రదేశ్‌ సభలో తెలంగాణ CM బాగా చేస్తున్నాడంటూ కొనియాడారు. కులగణనపై ఆయనతో చర్చిస్తూనే ఉన్నాం. ఆయన ఆమోదం లేకుండా చేస్తామా..? రాహుల్‌తో నా సాన్నిహిత్యం ఎలాంటిదో ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు.

News February 8, 2025

GOOD NEWS.. వారికి రూ.12,000

image

AP: వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. అగ్రికల్చర్, పశువైద్య విద్యార్థుల స్కాలర్‌షిప్‌ను ₹7K నుంచి ₹10Kకు, PG స్టూడెంట్లకు ₹12Kకు పెంచింది. అలాగే సన్న రకం వరి సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యాదవ, కురబలకు BC కార్పొరేషన్ ద్వారా గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.

News February 8, 2025

వరకట్నం కేసుల్లో కుటుంబం మొత్తాన్ని చేర్చడం తప్పు: సుప్రీం కోర్టు

image

వరకట్నం కేసుల్లో భర్త కుటుంబాన్ని నిందితులుగా చేర్చడం సరికాదని సుప్రీం కోర్టు తాజాగా అభిప్రాయపడింది. స్పష్టమైన ఆరోపణలుంటేనే వారిపై కేసు పెట్టాలని పేర్కొంది. ‘వైవాహిక వివాదాలు సాధారణంగా భార్యాభర్తల మధ్య భావోద్వేగాల కారణంగానే తలెత్తుతాయి. భర్త మీద కోపాన్ని అతడి కుటుంబీకులపై చూపించి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. అలా అందర్నీ ఇరికించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే’ అని ఓ కేసు విచారణలో తేల్చిచెప్పింది.

error: Content is protected !!