News February 8, 2025

వైభవంగా అంతర్వేదిలో కళ్యాణోత్సవం

image

AP: అంబేడ్కర్ కోనసీమ(D)లోని అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారికి అర్చకులు వివాహం జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు దాదాపు 2-3 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా.

Similar News

News February 3, 2026

ట్రేడ్ డీల్ ప్రకటనతో స్టాక్ మార్కెట్ల ధమాకా

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2072 పాయింట్ల లాభంతో 83,739కు చేరగా నిఫ్టీ 639 పాయింట్లు ఎగసి 25,727 వద్ద సెటిల్ అయింది. భారత్-US ట్రేడ్ డీల్‌పై ట్రంప్ ప్రకటన, US టారిఫ్స్ ఇప్పుడు పొరుగు దేశాలకంటే భారత్‌పై తక్కువ ఉండటం, రూపీ విలువ మెరుగవడం, ఆసియా మార్కెట్ల జోరు, ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్లలో జోష్ నింపాయి. SENSEX 30లో అదానీపోర్ట్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది.

News February 3, 2026

ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహం మాయం

image

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో ఉన్న దీన్ని దుండగులు కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2021లో భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన 426 కిలోల బరువున్న బాపూజీ స్టాచ్యూను అప్పటి ప్రధాని స్కాట్ మోరిసన్ ఆవిష్కరించారు.

News February 3, 2026

పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

image

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.