News February 8, 2025

నిర్మల్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ పురస్కారం

image

వ్యాసరచన పోటీల్లో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం సాధించిన ఎస్ఐ జ్యోతిమణిని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల నగదు పురస్కారంతో అభినందించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఫ్లాగ్ డే పోటీలలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్ఐ జ్యోతిమణి రూ.15000 నగదును అందజేశారు. రాష్టస్థ్రాయిలో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు ఉన్నారు.

Similar News

News February 8, 2025

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

<<15391662>>కర్మకు వెళ్లి వస్తుండగా<<>> బూడిదంపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో వీరబాబు, విజయ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. విజయ్‌కు భార్య, 3 కుమారులు, వీరబాబుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరబాబు మొదటి భార్యకు కుమార్తె జన్మించాక 8ఏళ్ల క్రితం కన్నుమూయడంతో మరో వివాహం చేసుకున్నాడు. కుమార్తెకు పెళ్లి నిశ్చయం కాగా ఇటీవలే ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News February 8, 2025

BREAKING: ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను తెరవనున్నారు. మొత్తం 19 కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. 70 స్థానాల్లో 36 చోట్ల విజయం సాధించిన పార్టీ అధికారం చేపట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది. రిజల్ట్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు WAY2NEWS యాప్‌లో తెలుసుకోండి.
Stay Tuned.

News February 8, 2025

జీతాలు వెనక్కి ఇవ్వండి: లెక్చరర్లకు నోటీసులు!

image

AP: డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు 2019లో తీసుకున్న 2నెలల జీతాలు వెనక్కివ్వాలని విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ కాంట్రాక్ట్ జూ.లెక్చరర్ల తరహాలో తమకు జీతమివ్వాలని డిగ్రీ కా.లెక్చరర్లు విన్నవించారు. ఆ మేరకు రాష్ట్రంలోని 600మందికి APL, మే నెలలకు గానూ 51రోజుల జీతాలందాయి. ఇలా తీసుకుంటే దాన్ని అదనంగా పరిగణించి జీతాలు వెనక్కి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

error: Content is protected !!