News February 8, 2025
సంగారెడ్డి: నేడు పాఠశాలలకు పని దినం: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యంకు సంబంధించిన పాఠశాలలు రేపు పని చేస్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించినందుకు, రేపు పాఠశాలల యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల హెచ్ఎమ్‌లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News March 21, 2026
సీతక్కకు ‘ఉత్తమ సేవా పురస్కార్’ అవార్డు

రాష్ట్ర మంత్రి సీతక్క శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కార్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 24న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులమీదుగా ప్రధానం చేయనున్నారు. అవార్డు ఎంపికకు సంబంధించిన పత్రాన్ని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అమరేష్ సీతక్కకు అందజేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు చేసిన సేవకు గానూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు చెప్పారు.
News March 21, 2026
హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలి: ఎమ్మెల్యే పల్లా

జనగామ జిల్లాలో దళిత మహిళలను ఇబ్బంది పెడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా ఉపాధి పొందుతున్న ఇద్దరి జీవనాధారాన్ని తొలగించే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. చదువు తక్కువగా ఉన్న మహిళల వద్ద అధికారుల చర్యలు అనుచితమని పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలన్నారు.
News March 21, 2026
రాజనగరం: రోడ్డు ప్రమాదంలో గాయపడింది వీరే..!

రాజానగరం ఏడీపీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖకు చెందిన కృష్ణమూర్తి, ఈశ్వరమ్మ, మనోహర్, కె. కృష్ణమూర్తి, లక్ష్మి, అఖిల కారులో వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తుండగా, మలుపు తిరుగుతున్న లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. క్షతగాత్రుల వివరాలను సీఐ వీరయ్యగౌడ్ మీడియాకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


