News February 8, 2025

ఆలేరు: బస్సులో కండక్టర్ పుస్తెలతాడు చోరీ..

image

జనగాం నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ వెళ్లే బస్సులో పుస్తెలతాడు అపహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జనగాం డిపోకు చెందిన TS27Z0028 నంబర్‌గల బస్సులో మహిళా కండక్టర్ ఉమామహేశ్వరికి చెందిన సుమారు మూడు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై మహేశ్వరి ఆలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 24, 2026

పోలవరం: తల్లి మరణం.. దుఃఖాన్ని దిగమింగుకుంటూ పరీక్ష రాసిన విద్యార్థిని

image

తల్లి మరణించిన దుఃఖంలో టెన్త్ పరీక్ష రాసింది ఓ విద్యార్థిని. ఈ సంఘటన పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో సోమవారం చోటు చేసుకుంది. కొయ్యురు మండలం కొత్తపల్లికి చెందిన సావిత్రి తల్లి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. రాజవొమ్మంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆ బాలిక సోమవారం లెక్కలు పరీక్ష రాసింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆమె పరీక్ష రాయడంతో తోటి విద్యార్థినులు, టీచర్స్ చలించిపోయారు.

News March 24, 2026

కురులు ఆరోగ్యంగా ఉండాలంటే..

image

మనం తినే ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్‌ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్‌ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి.

News March 24, 2026

అల్లూరి: తాటిచెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

ఎటపాక (M) ఎం.నల్లకుంట గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కూరం మల్లయ్య (60) కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు పట్టుతప్పి కిందపడిపోయారు. తీవ్ర గాయాలైన మల్లయ్యను కుటుంబ సభ్యులు వెంటనే గౌరీదేవిపేట పీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మల్లయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.