News February 8, 2025
జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి జిల్లా వాసి

కామారెడ్డి జిల్లా రక్త దాతల సమూహ అధ్యక్షుడు జమీల్ సాయి సేవ భగవాన్ జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికైనట్లు రక్త దాతల ఫౌండర్ డా.బాలు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి గుంటూరు జిల్లా చిలకలూరిపేట జయ జయ సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో ఈ పురస్కారాన్ని జమీల్ అందుకొనున్నారు.
Similar News
News March 22, 2026
ఆదిత్య ధర్ క్రికెట్ వదిలేయడానికి కారణం ఇదే!

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ భారత్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నారు. తనకు 2002 అండర్-19 WCలో చోటు పక్కా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీని సెలక్ట్ చేశారు. గొప్ప ఫామ్‌లో ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వకుండా రాజకీయాలు చేశారని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సినిమాల్లోకి వచ్చారు. కాగా బిన్నీ ఆ టోర్నమెంటులో 6 మ్యాచుల్లో 34 రన్స్ మాత్రమే చేశారు.
News March 22, 2026
HNK: బలహీన వర్గాలకు కిరోసిన్ సరఫరా అవసరం!

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ అనిచ్చితి కారణంగా గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే, హనుమకొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 1.92 లక్షలకు పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 20% బలహీన వర్గాల కుటుంబాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలో ఇక్కడ కూడా కిరోసిన్ సరఫరా చేయాలని పేద వర్గాలు కోరుతున్నాయి.
News March 22, 2026
డెడ్ స్టోరేజ్ లెవల్ చేరువలో సాగర్ డ్యాం

నాగార్జున సాగర్ డ్యాం నీటిమట్టం క్రమంగా తగ్గుతూ డెడ్ స్టోరేజ్‌కు చేరువవుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు, కనిష్ఠ స్థాయి 510 అడుగులు కాగా ప్రస్తుతం 535 అడుగుల వద్ద ఉంది. తాగు, సాగు అవసరాలకు రోజుకు సుమారు అడుగు చొప్పున నీరు విడుదలవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 20 రోజుల్లో డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


