News February 8, 2025
NZB: అప్పుల బాధతో వాచ్‌మెన్ ఆత్మహత్య

అప్పుల బాధతో ఓ వ్యక్తి పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4 టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. నవీపేటకు చెందిన రేపన్ శంకర్ (58) ఎల్లమ్మ గుట్టలోని అమ్మ వెంచర్‌లో వాచ్మెన్‌గా పనిచేస్తున్నారు. కూతురు పెళ్లి, ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. అప్పు తీర్చలేక మనోవేదనకు గురై రెండు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
NZB: ‘బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలి’

బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ పునః పరిశీలన (SRI)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ, లక్ష్యం మేరకు మ్యాపింగ్ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల, ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి VC నిర్వహించారు.
News March 13, 2026
‘అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తా’

అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.