News February 8, 2025
KMR: అంతర్జాతీయ ప్రశంసా పత్రం అందుకున్న వైద్యాధికారిణి

భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగిన 8 అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్‌లో కాలేయ వ్యాధులకు సంబంధించి రీసెర్చ్ స్టడీ పైన ప్రొఫెసర్ డాక్టర్ అస్మిత వేలే డైరెక్టర్ రిసెర్చ్ డీపీయూ పూణే చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ చైతన్య రమావత్ అందుకున్నారు. కాలేయ వ్యాధులకు సంబంధించి పరిశోధన చేయడం తనకు ఆనందంగా ఉందని చైతన్య రమావత్ తెలిపారు.
Similar News
News March 22, 2026
హనుమకొండలో ఎక్కువ.. వరంగల్‌లో తక్కువ!

ఉమ్మడి వరంగల్‌లో క్షయ వ్యాధి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలో ఈఏడాది 890 కొత్త కేసులు నమోదయ్యాయి. వరంగల్‌లో 289 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. వరంగల్ టీబీ సెంటర్‌లో వైద్యుల కొరత కారణంగానే కేసుల నమోదు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
News March 22, 2026
‘ASFలో నియంత్రణ లేని బోర్లు.. నీటి సంక్షోభం భయం’

ఆసిఫాబాద్ జిల్లాలో బోర్‌వెల్ త్రవ్వకాలు నియంత్రణ లేకుండా కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండానే విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారని సమాచారం. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ త్రవ్వకాలు జరగడంతో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు.
News March 22, 2026
అరకు వ్యాలీ మ్యూజియంలో పర్యాటకుల రద్దీ

అరకు ట్రైబల్ మ్యూజియంలో ఆదివారం రోజు భారీగా సందర్శకులు తరలివచ్చారు. వీకెండ్స్ కావడంతో పర్యాటకులు అధికంగా చేరుకొని, మ్యూజియం పరిసరాల్లో రద్దీగా మారాయి. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చుపించారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల నుంచి వీక్షకులు రావడంతో మ్యూజియంలో సందడి వాతావరణం నెలకొంది.


