News February 8, 2025
కార్తీ ఖైదీ-2లో కమల్ హాసన్?

లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో కార్తీ హీరోగా ఖైదీ-2 మూవీ త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. లోకేశ్-కమల్ కాంబోలో 2022లో వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో భాగంగానే ఖైదీ సీక్వెల్ కూడా ఉండనుంది.
Similar News
News March 14, 2026
6 నెలల్లో స్థానిక ఎన్నికలు: CM

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు అప్‌డేట్ ఇచ్చారు. ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉందని, వాటికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు. నిన్న క్యాబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని, ఈసారీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్‌ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.
News March 14, 2026
నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 13 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 9.30AM-12.30PM వరకు 3 గంటల పాటు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలని, ఎగ్జామ్ ప్రారంభమైన 5 ని. తర్వాత కూడా అంటే 9.35AM వరకు లోపలికి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచులు, కాలిక్యులేటర్లకు పర్మిషన్ లేదు.
All The Best
News March 14, 2026
సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు: BJP

ప్రపంచంలో ఇంధన సంక్షోభం నెలకొన్నా భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదని బీజేపీ ట్వీట్ చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో బ్యారెల్ ధర $100 దాటినా మోదీ ప్రభుత్వ ముందుచూపుతో దేశంలో రేట్లు పెరగలేదని తెలిపింది. ఇదే సమయంలో G20 దేశాల్లో 20% వరకు ఇంధన ధరలు పెరిగాయని వెల్లడించింది. దేశంలో 7-8 వారాలకు సరిపడా క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని, వివిధ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి అవుతోందని వివరించింది.


