News February 8, 2025
తాండూర్: పింఛను డబ్బుల కోసం నానమ్మపై దాడి!

పింఛన్ డబ్బుల కోసం నానమ్మపై దాడి చేసిన ఘటన కర్ణకోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ విట్టల్ రెడ్డి వివరాలిలా.. చెంగోల్ గ్రామానికి చెందిన మానెమ్మను ఆమె మనవడు నరేశ్ పింఛన్ డబ్బులు ఇవ్వాలని వేధించాడు. ఆమె ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో నరేశ్ ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని తలపై దాడి చేశాడు. గాయపడ్డ ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
తవణంపల్లిలో రోడ్డు ప్రమాదం

తవణంపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి మాధవరం వెళుతున్న ఆటోను గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో అరగొండలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌తో డ్రైవర్ పరారయ్యాడు. మరెన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 6, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ ఆంక్షలు

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామన్నారు.
News July 6, 2025
భక్తుల కొంగు బంగారం.. కొమ్మాల

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. చుట్టూ పచ్చని పొలాలతో గుట్టపై ఈ దేవాలయం ఉంది. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఈ ఆలయంలో ప్రతియేటా హోలీ సందర్భంగా జాతర జరుగుతుంది. మిగతా రోజుల్లోనూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడి రైతులు తొలి పంటను స్వామివారికి అందిస్తుంటారు.