News February 8, 2025
నంద్యాల జిల్లా ఎస్పీ కీలక సూచన

వాలంటైన్స్ డే సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు కీలక సూచన చేశారు. ఆఫర్స్ పేరుతో వచ్చే బహుమతులపై జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ మోసగాళ్లు వాలెంటైన్స్ డే కోసం బహుతులు అంటూ నకిలీ లింకులు పంపిస్తారని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయొద్దని అన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News March 21, 2026
మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రూ.25 కోట్లే!

Dy.CM భట్టి బడ్జెట్ ప్రసంగంలో MGUలో నూతనంగా LAW, ఫార్మసీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ నిధుల కేటాయింపుల విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరించింది. ఈ బడ్జెట్‌లో వర్సిటీకి కేవలం రూ. 25 కోట్లను మంజూరు చేసింది. ఈ అరకొర నిధులతో కొత్త కాలేజీలు ఎలా వస్తాయని, వర్సిటీ అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మిగులుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 21, 2026
ప్రీమియం పెట్రోల్ ధరల పెంపు.. కృష్ణా జిల్లాపై కోట్ల భారం

కేంద్ర ప్రభుత్వం ప్రీమియం పెట్రోల్‌పై రూ. 2.30 పెంపు చేయడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. జిల్లాలోని 350 బంకుల్లో రోజుకు 10.50 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగంలో సుమారు 10 శాతం ప్రీమియం వాటా ఉంది. ధర పెంపుతో రోజుకు రూ. 2.41 లక్షలు, నెలకు రూ. 72.45 లక్షలు, ఏడాదికి రూ. 8.69 కోట్ల భారం పడనుంది. దీంతో వినియోగం తగ్గే అవకాశముందని బంకుల యజమానులు చెబుతున్నారు.
News March 21, 2026
నెల్లూరు జిల్లాలో లక్ష సిలిండర్ల బుకింగ్..!

యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దిగుమతిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈక్రమంలో నెల్లూరు జిల్లాలో గడిచిన 10రోజుల్లోనే లక్ష సిలిండర్లను బుక్ చేశారు. సాధారణంగా నెలకు 40 వేల నుంచి 50 వేల వరకు డొమెస్టిక్ సిలిండర్లు బుక్ అయ్యేవి. గ్యాస్ కొరత వస్తుందేమోననే భయంతో ప్రజలు ఎగబడటంతో బుకింగ్ సంఖ్య లక్షకు చేరింది. సిలిండర్లకు ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తూనే ఉన్న ప్రజలు భయాందోళన వీడటం లేదు.


