News February 8, 2025

కరీంనగర్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూరాబాద్‌లోని ఇందిరానగర్‌లో జరిగింది. పోలీసుల కథనమిలా.. గ్రామానికి చెందిన కోలుగోరి సుజిత్ (30) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించకపోవడంతో పురుగు మందు తాగాడు. ఈ క్రమంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News February 8, 2025

మస్తాన్‌సాయి కేసులో ఏపీ అధికారి వీడియోలు

image

మస్తాన్ సాయి, శేఖర్ బాషా ప్రైవేట్ <<15374455>>వీడియోల<<>> కేసులో ఓ AP అధికారి లీలలు బయటికొచ్చాయి. అడిషనల్ SP స్థాయిలో పనిచేసిన ఆయన ఓ యువతితో ఉన్న ఫొటోలు, చాటింగ్ దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ కేసు విషయంలో వారిమధ్య ఏర్పడిన పరిచయం వీడియో కాల్స్ వరకు వెళ్లినట్లు సమాచారం. తర్వాత ఆయన మోసం చేశాడంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో యువతికి సాయం చేసిన శేఖర్ బాషా ఆ వీడియోలను తీసుకున్నట్లు తెలుస్తోంది.

News February 8, 2025

ఓటమి దిశగా సీఎం ఆతిశీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ తరఫున కల్కాజీ నుంచి పోటీ చేసిన సీఎం ఆతిశీ మార్లేనా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆమె ఏ దశలోనూ లీడింగ్‌లోకి రాలేదు. ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీ 3,231 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రమేశ్ లీడింగ్ ఇలాగే కొనసాగితే ఆతిశీ ఓటమి ఖాయమైనట్లే. అటు కేజ్రీవాల్‌పైనా బీజేపీ అభ్యర్థి పర్వేశ్ ఆధిక్యంలో ఉన్నారు.

News February 8, 2025

HYD: మాజీ రాష్ట్రపతికి సీఎం నివాళులు

image

మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. జాకీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్, మల్లు రవి, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

error: Content is protected !!