News February 8, 2025

కోటనందూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు SI రామకృష్ణ తెలిపారు. ఈనెల 2న కోటనందూరు హెరిటేజ్ పాయింట్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బొద్దవరానికి చెందిన సుర్ల రాజబాబు (30) అనే వ్యక్తి బైక్ నుంచి జారిపడటంతో తలకు గాయమైంది. అతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.

Similar News

News November 13, 2025

LSG-MI మధ్య టాక్స్.. ఎక్స్‌ఛేంజ్‌ అయ్యేది వీళ్లే!

image

IPL రిటెన్షన్ గడువు దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల స్వాపింగ్‌ చర్చల్లో వేగం పెంచాయి. RR, CSK మధ్య <<18253766>>కీలక ఆటగాళ్ల<<>> ఎక్స్‌ఛేంజ్‌కు ఇప్పటికే ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. తాజాగా LSG-MI కూడా చెరో ప్లేయర్‌ను మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. LSG నుంచి MIకి శార్దూల్ ఠాకూర్, MI నుంచి LSGకి అర్జున్ టెండూల్కర్ మారతారని cricbuzz తెలిపింది. MIతో శార్దూల్ డీల్ కుదిరినట్లు అశ్విన్ చెప్పడం గమనార్హం.

News November 13, 2025

‘పామాయిల్ తోటల పెంపకంపై అవగాహన కల్పించాలి’

image

జిల్లాలో పామాయిల్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఉద్యాన శాఖ ప్రతి నెల 100 హెక్టార్లలో పామాయిల్ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ మొబైల్ వాహనాల ద్వారా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు.

News November 13, 2025

HYD: చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం కాదు

image

చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదని.. దాని అవసరాలు నెరవేరే విధంగా వాటిని తీర్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శిల్పకళా వేదికలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా CSR సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CSR నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.