News February 8, 2025
మేజిక్ ఫిగర్ దక్కేదెవరికో?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738976180778_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 70 స్థానాలున్న దేశ రాజధానిలో అధికారం చేపట్టాలంటే 36 స్థానాలు గెలుచుకోవాలి. తాము 50 సీట్లతో విజయఢంకా మోగించబోతున్నామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా మూడోసారి అధికారం తమదేనని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత తేలిపోయింది. ఈ సారి కనీసం పరువు కాపాడుకోవాలని ఆరాటపడుతోంది.
Similar News
News February 8, 2025
ఢిల్లీలో తొలి గెలుపు ఎవరిదంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738996910409_782-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందిన ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తన సమీప అభ్యర్థి ప్రియాంక గౌతమ్(బీజేపీ)పై 6293+ ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. ఆ తర్వాత లక్ష్మీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయం సాధించారు.
News February 8, 2025
ట్విటర్లో ‘EVM HACK’ ట్రెండింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738995853738_746-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న వేళ ‘EVM HACK’ హాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండవుతోంది. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ వైపు ఉన్నారని, ఫలితాలు సరైనవి కావంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. EVMలను హ్యాక్ చేసే అవకాశం ఉందనే అమెరికాలో బ్యాలెట్ ఓటింగ్ పెట్టారంటున్నారు. అయితే, మరికొందరు ‘ఓటమిని అంగీకరించకుండా ఇప్పుడు EVM హ్యాక్ అయిందని పోస్టులు పెడతారు’ అని సెటైర్లు వేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News February 8, 2025
మస్తాన్‌సాయి కేసులో ఏపీ అధికారి వీడియోలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738969515900_695-normal-WIFI.webp)
మస్తాన్ సాయి, శేఖర్ బాషా ప్రైవేట్ <<15374455>>వీడియోల<<>> కేసులో ఓ AP అధికారి లీలలు బయటికొచ్చాయి. అడిషనల్ SP స్థాయిలో పనిచేసిన ఆయన ఓ యువతితో ఉన్న ఫొటోలు, చాటింగ్ దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ కేసు విషయంలో వారిమధ్య ఏర్పడిన పరిచయం వీడియో కాల్స్ వరకు వెళ్లినట్లు సమాచారం. తర్వాత ఆయన మోసం చేశాడంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో యువతికి సాయం చేసిన శేఖర్ బాషా ఆ వీడియోలను తీసుకున్నట్లు తెలుస్తోంది.