News March 19, 2024
అడ్డాకుల: కుక్కలను కాల్చి చంపిన ముగ్గురి అరెస్ట్

అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో కుక్కలను కాల్చి చంపిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నడంతో గ్రామానికి చెందిన పలువురు ఈనెల 15న దాదాపు 20 కుక్కలను కాల్చి చంపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో నేడు నిందితులు నర్సింహారెడ్డి, తారిఖ్ అహ్మద్, మహమూద్ తాహీర్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News April 5, 2025
MBNR: PU నివేదిక ఇవ్వండి: CM

విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి.ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు. అవసరమైన నిధుల, భవనాల నియామకాలపై నివేదిక ఇవ్వాలన్నారు.
News April 5, 2025
MBNR: ప్రేమించాడని యువకుడిపై దాడి

నవాబుపేట మండలంలో యువతిని ప్రేమించాడని యువకుడిపై దాడి జరిగిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. పల్లెగడ్డకు చెందిన అరవింద్ పాత పాలమూర్‌కు చెందిన యువతిని ప్రేమించాడు. విషయం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు అరవింద్‌ను మాట్లాడుదామని గ్రామం బయటికి తీసుకెళ్లి దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News April 5, 2025
మహబూబ్‌నగర్: BJP నాయకులపై కేసు నమోదు

పాఠశాల తరగతులు జరుగుతున్న సమయంలో విధులకు ఆటంకం కలిగించిన BJP నాయకులపై కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం MBNR జిల్లా చిన్నచింతకుంటలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ తెలిపిన వివరాలు.. ఉన్నత పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో BJP నాయకులు రమేశ్, శివ మరికొందరు కార్యకర్తలు HM అనుమతి లేకుండా పాఠశాలను విడిపించి విద్యార్థులను తీసుకొని CM దిష్టిబొమ్మ దహనం చేశారని HM మాధవి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.