News February 8, 2025
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738976230435_1045-normal-WIFI.webp)
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
Similar News
News February 8, 2025
ఎవరీ పర్వేశ్ వర్మ?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739000264115_81-normal-WIFI.webp)
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్వేశ్ వర్మ మట్టికరిపించిన విషయం తెలిసిందే. జాట్ సామాజిక వర్గానికి చెందిన 47 ఏళ్ల పర్వేశ్ ఢిల్లీ మాజీ CM సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. 2013లో మెహరౌలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 2014- 2024 వరకు వెస్ట్ ఢిల్లీ MPగా పనిచేశారు. కేజ్రీవాల్‌పై గెలుపు నేపథ్యంలో ఈయన పేరును CM అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
News February 8, 2025
KK సర్వేకు బిగ్ షాక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738996870684_81-normal-WIFI.webp)
AP ఎన్నికలపై ఎగ్జాక్ట్ ఫిగర్‌కు దగ్గరగా ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించిన KK సర్వే ఇటీవల తేలిపోతోంది. ఢిల్లీలో AAPకు అధికారం వస్తుందని, ఆ పార్టీ 44 సీట్లు గెలుస్తుందని ఇటీవల ఈ సర్వే అంచనా వేసింది. కానీ ఫలితాల్లో AAP 22, BJP 48 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. అటు 2024 హరియాణా ఎన్నికలపై ఈ సర్వే(INC-75, BJP-11) అంచనా ప్రకటించగా, అసలు ఫలితాల్లో BJP(48) గెలిచింది. దీంతో ఎగ్జిట్‌పోల్స్ క్రెడిబిలిటీ చర్చగా మారింది.
News February 8, 2025
Breaking: ఢిల్లీ సీఎం ఆతిశీ విజయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739000445076_1199-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి స్వల్ప ఊరట. ఢిల్లీ సీఎం ఆతిశీ మార్లేనా 3521 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కల్కాజీ నుంచి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రమేశ్ బిధూరీని ఓడించారు. 9 రౌండ్లు ముగిసే సరికి 252 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమె పదో రౌండులో 989 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆఖరిదైన 12వ రౌండ్ ముగిసే సరికి 3521 ఓట్ల ఆధిక్యం అందుకున్నారు. కేజ్రీ, సిసోడియా ఓడినా ఆతిశీ గెలవడం గమనార్హం.