News February 8, 2025
నర్సీపట్నంలో అల్లూరికి చెందిన ఫారెస్ట్ ఉద్యోగి మృతి
నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు వెనుక టైరు కింద పడి పుట్టన్న అనే ఫారెస్ట్ ఉద్యోగి మృతి చెందిన విషయం తెలిసిందే. నర్సీపట్నం కూడలిలో బైక్‌పై వెళ్తుండగా హ్యాండీల్ అటుగా వెళ్తున్న బస్సుకు తగలడంతో ఈ ఘటన జరిగింది. దీనిపై టౌన్ సీఐ గోవిందరావు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్ మర్రిపాకల రేంజ్‌లోని పలకజీడి సెక్షన్ అధికారిగా పని చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
మెదక్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది
గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. మెదక్ జిల్లాలో 493 గ్రామపంచాయతీలుండగా, మొత్తం 5,25,478మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,52,797మంది, మహిళలు 2,72,672మంది ఉన్నారు. ఇతరులు 9మంది ఉన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను అనుసరించి తాజాగా గ్రామపంచాయతీ ఓటర్ జాబితాను అధికారులు సిద్ధం చేశారు.
News February 8, 2025
మనీశ్ సిసోడియా ఓటమి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓడిపోయారు. జంగ్‌పుర నుంచి పోటీ చేసిన ఆయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.
News February 8, 2025
VKB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.