News February 8, 2025

NGKL: యువకుడి ఆత్మహత్య

image

తాను ప్రేమించిన యువతి ఇంట్లో తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు ఆత్మహత్యకి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. NGKL మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు (23) ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Similar News

News February 8, 2025

ఆమన్‌గల్‌కు 13న కేటీఆర్

image

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్‌గల్‌లో బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నెల 13న పదిహేను వేల మందితో రైతు దీక్ష ఉండనుంది. ఈ దీక్ష మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో జరగనుంది. ఈ కార్యక్రమనికి మాజీమంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. రైతు మహాదీక్షకి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు.

News February 8, 2025

అదానీ మంచి మనసు.. రూ.10,000 కోట్ల డొనేషన్

image

కుమారుడు జీత్ అదానీ-దీవా షాల పెళ్లి సందర్భంగా వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మంచి మనసు చాటుకున్నారు. సేవా కార్యక్రమాలకు రూ.10,000 కోట్లు వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారని వెల్లడించాయి. ‘సేవ చేయడమే భక్తి, సేవే ప్రార్థన, సేవే పరమాత్మ’ అనేది అదానీ ఫిలాసఫీ అని పేర్కొన్నాయి.

News February 8, 2025

అరవింద్ కేజ్రీవాల్ ఓటమి

image

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయన్ను 3182 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు.

error: Content is protected !!