News February 8, 2025
సిరిసిల్ల: ట్రాక్టర్‌లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్‌లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.
Similar News
News March 7, 2026
KNR: తహశీల్దార్‌పై ఏసీబీ పంజా.. రూ.4 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై గజ్వేల్ తహశీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కరీంనగర్‌లోని నివాసంతో పాటు మరో రెండు చోట్ల జరిపిన సోదాల్లో రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. వీటిలో 2 ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్ (6 ఫ్లాట్లు), మరో 4 ప్లాట్లు, రూ.11.90 లక్షల నగదు, కిలోల కొద్దీ బంగారం ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 6, 2026
మిషన్ మోడ్‌లో ‘ప్రజా పాలన’: కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ జిల్లాలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను మిషన్ మోడ్‌లో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో 99 రోజుల కార్యాచరణపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ప్రత్యేక అంశాలతో (థీమ్స్) ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు.
News March 6, 2026
UPDATE: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

<<19312594>>బైక్‌ను టిప్పర్<<>> ఢీకొన్న ఘటనలో చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చిలుక ప్రదీప్ కుమార్, తాటికొండ సాయి కిరణ్ మృతి చెందారు. శుక్రవారం ఈ ఇద్దరు మిత్రులు బైక్‌పై వెళుతుండగా చాకుంట ఎక్స్ రోడ్డు వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకుల తలలు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


