News February 8, 2025

కాగజ్‌నగర్: వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్ఐ మహేందర్

image

కాగజ్‌నగర్ మండలంలోని ఇస్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మహేందర్ ఉదయం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై డ్రంక్ అండ్ టెస్టులు చేశారు. వాహన పత్రాలు, లైసెన్స్, హెల్మెట్ లేని వారికి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించారు. అనంతరం మాట్లాడుతూ.. వాహనదారులు లైసెన్స్‌తో పాటు ద్రువపత్రాలు తమ వెంట ఉంచుకోవాలన్నారు.

Similar News

News January 14, 2026

కామారెడ్డి: భోగి సంబరం.. ముంగిళ్లలో విరిసిన రంగవల్లులు!

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ తొలిరోజైన ‘భోగి’ వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే మహిళలు తమ వాకిళ్లను శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరించారు. పండుగను పురస్కరించుకుని పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యువతులు పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసిన నిర్వాహకులు, విజేతలకు బహుమతులను అందజేశారు.

News January 14, 2026

PPPలో వైద్యసేవలపై కేంద్రం మార్గదర్శకాలు

image

AP: PPP విధానంలో మెరుగైన వైద్యసేవల కోసం 5 మార్గదర్శకాలను కేంద్రం నిర్దేశించింది. ఈమేరకు రాష్ట్రానికి లేఖ రాసింది. న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, MMUలు, డెంటల్, రేడియాలజీ, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను PPPలో విస్తరించాలంది. ఎక్విప్‌, ఆప‌రేట్‌, మెయింటైన్‌ (EOM), ఆప‌రేట్ అండ్ మెయింటైన్‌(O and M)ల ద్వారా సేవ‌లు పెంచాలని పేర్కొంది. ప్రైవేట్ సంస్థలకు చెల్లింపుల విధానంపై కూడా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అందించింది.

News January 14, 2026

ఫ్యూచర్ సిటీలో ‘బ్లాక్ చైన్’ సిస్టం

image

భూమి మీది.. కానీ రికార్డుల్లో ఇంకొకరిది. ఫ్యూచర్ సిటీలో ఇలాంటి మాయాజాలం చెల్లదు. ఇక్కడ ప్రతి అంగుళం ‘బ్లాక్ చైన్’ భద్రతలో ఉంటుంది. ప్రభుత్వం “హైడ్రా-లెడ్జర్” వ్యవస్థను డిజైన్ చేసింది. సాధారణంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయొచ్చు.. కానీ ఇక్కడ ‘బ్లాక్ చైన్’ వాడటం వల్ల ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారని అధికారులు Way2Newsకు వివరించారు.