News February 8, 2025

తండేల్ సినిమాలో మంచిర్యాల జిల్లా వాసి

image

కన్నెపల్లి మండల కేంద్రం ముత్తపూర్‌కు చెందిన హరీశ్ మొదట ఢీ జోడిలో సైడ్ డాన్సర్‌గా రాణించారు. అనంతరం శుక్రవారం విడుదలైన తండేల్ సినిమాలో విలన్‌కు సైడ్ క్యారెక్టర్‌గా హరీశ్ నటించారు. డైరెక్టర్‌గా చందూ మొండేటి, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి సినిమాలో నటించారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన హరీశ్ చిన్న పాత్రలో కనిపించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరకు సినిమాలో కనిపించారు. 

Similar News

News March 16, 2026

10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.

News March 16, 2026

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

image

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మహా క్షేత్రంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి వరుసగా భృంగి, కైలాస, నంది, అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. అమ్మవారు మహాలక్ష్మి, మహాదుర్గ, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, నిజరూప అలంకారాల్లో దర్శనమిస్తారు. ఈ 5 రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

News March 16, 2026

స్త్రీనిధి రుణాలు పక్కదారి.. రూ.1.50 కోట్లు గోల్‌మాల్‌

image

వరంగల్‌ గ్రేటర్‌ కార్పొరేషన్‌ పరిధిలో స్త్రీనిధి రుణాలు దారి తప్పాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి కిస్తీలు వసూలు చేసిన 50 మంది రిసోర్స్‌ పర్సన్లు (ఆర్‌పీలు), ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.1.50 కోట్లు సొంతానికి వాడుకున్నారు. అధికారుల నోటీసులతో అసలు విషయం బయటపడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులైన ఆర్‌పీలకు అధికారులు మెమోలు జారీ చేశారు.