News February 8, 2025
బాత్రూంలో 6 ఏళ్ల బాలికపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి

శంషాబాద్‌లో ఇన్‌ఫాంట్ స్కూల్ విద్యార్థినిపై బస్‌డ్రైవర్<<15391202>>అసభ్యంగా ప్రవర్తించిన<<>> విషయం తెలిసిందే. ఈనెల 4న రంగారెడ్డి జిల్లా కాగజ్‌ఘాట్‌లోని సిరినేచర్ రిసార్ట్‌కి పిక్నిక్‌కు వెళ్లిన 6ఏళ్ల బాలికపై బస్‌డ్రైవర్ బాత్రూంలో లైంగికదాడి చేశాడని విద్యార్థిని తల్లి శుక్రవారం మంచాల PSలో ఫిర్యాదు చేసింది. పాప ఇంటికి వచ్చి నొప్పిగా ఉందని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News September 12, 2025
HYD: అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్: దానం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన వ్యక్తి గెలుపు కోసం కృషి చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మీరు పోటీ చేస్తారని, మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారంపై మీడియా ప్రతినిధులు అడగగా.. అవన్నీ ఊహగానాలు కావచ్చని అన్నారు. అయితే అధిష్ఠానం నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం ఎంతో అవసరమని దానం అన్నారు.
News September 12, 2025
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాణి

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా అడిషనల్ డీఎంఈ డాక్టర్ వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ రాజకుమారిని ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
News September 9, 2025
ఉమ్మడి RR ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా పెంటయ్య

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెంటయ్య గౌడ్ ఎన్నికయ్యారు. పలు మండలాల ఏఎంసీ ఛైర్మన్లు ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వారందికీ ధన్యవాదాలు తెలిపారు.