News February 8, 2025
BJPని గెలిపిద్దాం: కామారెడ్డి MLA

పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ BJP గెలవాలని కామారెడ్డి MLA వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల BJP గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Similar News
News November 6, 2025
10న ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక ఎంపిక పోటీలు

జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10న ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ మహిళల, పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ బాన్సువాడలోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు N.V. హన్మంత్ రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఫిజికల్ డైరెక్టర్ సురేందర్‌ను సంప్రదించాలన్నారు.
News November 5, 2025
నిజామాబాద్: సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో తాహెర్ బిన్ హందాన్

తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డికి శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయిలోకి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
News November 5, 2025
రాజకీయ పార్టీలకు బూత్ లెవల్ ఏజెంట్లు: నిజామాబాద్ కలెక్టర్

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్‌లో తమ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాను మ్యాపింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.


