News February 8, 2025
జగిత్యాల: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్‌ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 8, 2025
Breaking: ఢిల్లీ సీఎం ఆతిశీ విజయం
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి స్వల్ప ఊరట. ఢిల్లీ సీఎం ఆతిశీ మార్లేనా 3521 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కల్కాజీ నుంచి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రమేశ్ బిధూరీని ఓడించారు. 9 రౌండ్లు ముగిసే సరికి 252 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమె పదో రౌండులో 989 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆఖరిదైన 12వ రౌండ్ ముగిసే సరికి 3521 ఓట్ల ఆధిక్యం అందుకున్నారు. కేజ్రీ, సిసోడియా ఓడినా ఆతిశీ గెలవడం గమనార్హం.
News February 8, 2025
BJPకి అండగా ముస్లిం మహిళలు!
ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడం వెనక ముస్లిం మహిళల పాత్ర ఉందని విశ్లేషకులు అంటున్నారు. ట్రిపుల్ తలాక్, సెంట్రల్ స్కీమ్స్ ఇందుకు దోహదం చేశాయని చెప్తున్నారు. ఆ మతంలోని పశుమందా వంటి వెనకబడిన వర్గాలు అండగా నిలిచాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, ఆప్ తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్న IUML ప్రెసిడెంట్ తొలిసారి బీజేపీకి ఓటేయడం, అనుచరులను ప్రభావితం చేయడమూ కలిసొచ్చిందని అంటున్నారు.
News February 8, 2025
‘లైలా’కు A సర్టిఫికెట్: విశ్వక్ సేన్
తన తాజా సినిమా ‘లైలా’కు సెన్సార్ బోర్డు ‘A’(పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ ఇచ్చిందని హీరో విశ్వక్ సేన్ వెల్లడించారు. మూవీ చూస్తే ‘A’ సర్టిఫికెట్ ఎందుకో అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘ప్రేక్షకులు రొటీన్ మూవీస్‌ని చూడటం లేదు. అందుకే ఇలాంటి విచిత్రమైన కథను సెలక్ట్ చేశాం. డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను. కానీ లేడీ గెటప్ వేయడమే కష్టంగా అనిపించింది’ అని స్పష్టం చేశారు.