News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తాత్కాళిక రద్దు

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలునంబరు 17233,17234)ను ఈనెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాళికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తంచేస్తున్నారు.
Similar News
News November 17, 2025
KNR: ప్రైవేటు ఆసుపత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో డీఎంహెచ్ఓ డా. వెంకటరమణ స్పెషల్ డ్రైవ్ టీమ్‌తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రుల్లోని రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, ఫామ్(F) డాక్యుమెంట్లను పరిశీలించారు. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ (MTP), అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ (ART) చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

మహిళా పోలీసులకు ‘షి-లీడ్స్’ శిక్షణ ప్రారంభం

మహిళా పోలీసులు ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సంఘటనలను ఎదుర్కొనేలా వినూత్నమైన ‘షి-లీడ్స్’ శిక్షణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు. ధర్నాలు, నిరసనలలో, ముఖ్యంగా మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ శిక్షణలో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మహిళా పోలీసుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని సీపీ తెలిపారు.