News February 8, 2025
MNCL: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంచిర్యాల జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 13, 2026
HYD: ఇంటిపై కూరగాయల సాగు నేర్చుకుంటారా?

జంటనగరాల్లో ఇంటి పైకప్పులు, బాల్కనీలో కూరగాయలు పెంచాలనుకునే వారికి ఉద్యానశాఖ శిక్షణ ఇవ్వనుంది. అర్బన్ ఫార్మింగ్ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అర్బన్ ఫార్మింగ్ విభాగం సంచాలకులు రామలక్ష్మి తెలిపారు. ఈ శిక్షణ మార్చి 14న నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఉ.10 గంటల నుంచి మ.ఒంటి గంట వరకు జరుగుతుంది. వివరాలకు 8977714411 ఈ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.# SHARE IT
News March 13, 2026
ధర్మవరం: 14 ఏళ్ల తర్వాత ఇంటికి..!

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన పరమేశ్, లక్ష్మీదేవమ్మ కుమారుడు నాగార్జున చదువుకోవడం ఇష్టం లేక 10thలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బెంగళూరులో కొత్త కాలం ఉన్నాడు. శాంతిపురానికి చెందిన బాబా అతడిని తెచ్చి పెంచుకున్నాడు. బాబా తమ రేషన్ కార్డులో అతని పేరు చేర్చడంతో కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్నట్లు తెలిసింది. TDP నేతల సహకారంతో నాగార్జునను 14 ఏళ్ల తర్వాత తమ ఇంటికి తీసుకెళ్లారు.
News March 13, 2026
‘క్రీమీ లేయర్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

OBC రిజర్వేషన్ల కోసం క్రీమీ లేయర్ హోదాను తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి మాత్రమే నిర్ణయించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయా సంస్థల్లో వారి పదవులు, హోదానూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సివిల్స్ పరీక్షను క్లియర్ చేసినా క్రీమీ లేయర్‌లో పొరపాటున చేర్చడంతో నష్టపోయిన అభ్యర్థులకు ఊరట కల్పించింది. వారి అపాయింట్‌మెంట్స్‌ను నిరాకరిస్తూ కేంద్రం వేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.


