News February 8, 2025

NZB: వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే: జీవన్ రెడ్డి

image

వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుబంధ సంస్థగా పోలీసు శాఖ పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి జాతకాలు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను అధికారులు, పోలీసులు వేధిస్తున్నారన్నారు.

Similar News

News July 5, 2025

KNR: రేపు జూనియర్ బాలబాలికల నేషనల్ హాకీ సెలక్షన్స్

image

సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్‌లో జూనియర్ బాలబాలికల నేషనల్ హాకీ సెలక్షన్ ట్రయల్స్ ఆదివారం నిర్వహించనునట్లు జిల్లా హాకి జాయింట్ సెక్రటరీ తిరున హరి శ్రీనివాస్ తెలిపారు. ఈ హాకీ ట్రయల్స్ కోసం ఆసక్తి గల జిల్లాలోని హాకీ క్రీడాకారులు తమ పేర్లను జిల్లా ఇన్ఛార్జి సెక్రటరీ అలీ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 7075667465, 9949029440 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News July 5, 2025

తాండవ జలాశయం నుంచి సాగు నీరు అందజేత..!

image

తాండవ జలాశయం కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో 51,465 ఎకరాలకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నట్లు ప్రాజెక్ట్ డీఈ అనురాధ తెలిపారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాలో 25,440 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో 7,385 ఎకరాలకు, కుడి ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాలో 7,249 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో 11,391 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.

News July 5, 2025

25 కుటుంబాలను దత్తత తీసుకున్న దగ్గుపాటి అశ్రిత

image

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుమార్తె దగ్గుపాటి అశ్రిత పీ4 కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. దగ్గుపాటి ఫౌండేషన్ తరఫున 25 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్ తొలి సమావేశంలో ఎమ్మెల్యే ఈ ప్రకటన చేశారు. దగ్గుపాటి అశ్రితను అధికారులు, పీ4 టీం సభ్యులు అభినందించారు.