News February 8, 2025

కాగజ్‌నగర్: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 7, 2026

విజయవాడ: తండ్రి సీఐ.. కుమార్తెకు సివిల్స్‌లో 520 ర్యాంక్

image

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాలను శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అహోరాత్రులు శ్రమించిన అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. విజయవాడకు చెందిన సీఐ సుధాకర్ కుమార్తె హర్షిత 520వ సాధించి సత్తాచాటారు. తాను 2022 సంవత్సరం నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు హర్షిత తెలిపారు. ఈ మేరకు ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

News March 7, 2026

WGL: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

image

జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 288 పాఠశాలల నుంచి మొత్తం 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,932 మంది బాలురు, 4,560 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం నిషేధం.

News March 7, 2026

బొండపల్లి: 24గంటల్లో బాలుడికి కొత్త ఆధార్ కార్డు

image

బొండపల్లి మండలం కిండాం అగ్రహారంకి చెందిన బుంగ జోసిత్ అనే ఏడాది బాలుడు అనారోగ్యంతో విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ప్రయోజనాలకు ఆధార్ కార్డు ఉండాలని ఆసుపత్రి తెలపగా..తండ్రి అప్పలనాయుడు పోస్టల్ శాఖ‌ను సంప్రదించాడు. గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర తమ సిబ్బందిని ఆసుపత్రికి పంపించి 24 గంటల్లో జోసిత్‌కు కొత్త ఆధార్ కార్డును ఎన్రోల్మెంట్ చేయించారు.