News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హనుమకొడ, జనగామ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 6, 2026
శ్రీవాణి దర్శన టికెట్లు ఇక ఆన్‌లైన్‌లోనే

తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయడాన్ని TTD నిలిపేసింది. ఈ నెల 9 నుంచి రోజూ ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో 800 టికెట్లను కేటాయించనుంది. ఉ.9 గంటలకు విడుదల చేయనుంది. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సా.4 గంటలకు దర్శనానికి రిపోర్ట్ చేయాలి. ఈ విధానాన్ని నెల రోజులు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఒక కుటుంబానికి నలుగురు(1+3) సభ్యులకే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది.
News January 6, 2026
మన నీటి సమస్యపై సరైన రీతిలో వాదన వినిపించాలి: మాధవ్

ఏపీకి రావాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చెయ్యాలని, బలమైన వాధన వినిపించాలన్నారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు తుది ఆమోదం తెలిపే ముందు, ప్రయాణికుల రాకపోకల సరళి, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, పెట్టుబడిపై రాబడి వంటి అనేక అంశాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంగళవారం తెలిపారు.
News January 6, 2026
పేద ఖైదీలకు సహాయం పథకం అమలు చేయాలి: కలెక్టర్

‘పేద ఖైదీలకు సహాయం’ పథకం అమలును మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం DLSA కార్యదర్శి రాజశేఖర్, ఎస్పీ సతీష్ కుమార్‌తో కలెక్టర్
తన కార్యాలయంలో మాట్లాడారు. పేద ఖైదీలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా జైల్లోనే ఉండిపోకుండా న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


