News March 19, 2024
మెదక్: రైలు నుంచి పడి యువకుడి మృతి

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం – మాసాయిపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్లోంచి పడి గుర్తుతెలియని 35 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సమయంలో ప్రయాణిస్తున్న రైల్లోంచి పడి యువకుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News September 3, 2025
ప్రభుత్వ ఉద్యోగులు క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోండి: డివైఎస్ఓ

క్రీడల పట్ల ఆసక్తి ఉన్న మెదక్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ రాధాకిషన్ తెలిపారు. ఈ నెల 6న దరఖాస్తు చేసుకోవాలని, పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే అర్హులని చెప్పారు. ఉద్యోగులు తమ సర్వీస్ సర్టిఫికేట్, తాజా ఐడీ కార్డుతో తమ పేర్లను జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
News September 3, 2025
టేక్మాల్: గణపతి లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు

టేక్మాల్‌లో గణపతి లడ్డూను ముస్లిం యువకుడు మతీన్ దక్కించుకున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం టేక్మాల్‌లోని నాగులమ్మ ఆలయం వద్ద గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో గ్రామానికి చెందిన మతీన్ రూ. 21 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు అతనికి ఈ ఘటన మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది.
News September 3, 2025
మెదక్ జిల్లాలో 5,23,327 మంది ఓటర్లు

తుది ఓటరు జాబితా ప్రకారం మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,23,327 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 2,51,532 మంది, మహిళలు 2,71,787 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. వార్డుకు ఒకటి చొప్పున మొత్తం 4,220 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తులో అధికారులు నిమగ్నమయ్యారు.