News February 8, 2025

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలునంబరు 17233,17234)ను ఈనెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో భువనగిరి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 17, 2025

కామారెడ్డి: వరద సహాయక చర్యల్లో పోలీసుల అద్భుత ప్రతిభ

image

ఇటీవల KMR జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న 800 మందికి పైగా ప్రజలను త్వరితగతిన రక్షించిన పోలీసు శాఖ ధైర్య సాహసాలను రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ప్రశంసించారు. కామారెడ్డిలో బుధవారం జరిగిన ప్రజాపాలన వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జిల్లాను నేర రహిత సమాజంగా మార్చడానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరి సహకారం అవసరమని ఆయన కోరారు.

News September 17, 2025

స్వాతంత్య్ర పోరాటంతో RSSకు సంబంధం లేదు: బృందాకారత్

image

భారత స్వాతంత్ర్య పోరాటంతో బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్పష్టం చేశారు. నల్గొండలో జరుగుతున్న వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

News September 17, 2025

కామారెడ్డి: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి: కోదండరెడ్డి

image

కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు తెలంగాణ వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిన చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.