News February 8, 2025
కామారెడ్డి పెద్ద చెరువులో యువకుడి గల్లంతు

కామారెడ్డి పెద్ద చెరువులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన చిన్నచెవ్వ రాములు, అతడి చిన్నకొడుకు సాయికుమార్ (24)తో కలిసి శుక్రవారం సాయంత్రం పెద్ద చెరువుకు వెళ్లారు. స్నానం చేసేందుకు సాయికుమార్ చెరువులోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేవునిపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News January 8, 2026
NZB: ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట అగ్ని మాపక అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
News January 8, 2026
నిజామాబాద్: బయ్యర్ – సెల్లర్ మీటింగ్‌లో పసుపు బోర్డు ఛైర్మన్

మైసూర్‌లో జరిగిన బయ్యర్-సెల్లర్ మీటింగ్‌లో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆశలు, ఆశయాలకు కొత్త దిశ చూపిన హృదయస్పర్శి సమావేశంగా నిలిచిందన్నారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు, భవిష్యత్ మార్కెట్ అవకాశాలపై ఆశతో పెద్ద ఎత్తున హాజరైన రైతులు ఈ సమావేశానికి ప్రాణం పోశారని కొనియాడారు.
News January 8, 2026
NZB: 13 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ES మల్లారెడ్డి తెలిపారు. ADBకి చెందిన పూజ పవర్, డి.బాయి జాదవ్ లు MP లో గంజాయి కొనుగోలు చేసి MH కు చెందిన కిషన్ మోతిరామ్ దాలే, ఇంద్రజిత్ టాగ్రే లను కలుపుకొని, చద్మల్‌కు చెందిన మంజ వెంకట్రాంకు గంజాయిని ఇస్తుండగా CI స్వప్న ఆధ్వర్యంలో పట్టుకున్నామని వివరించారు.


