News February 8, 2025
జీతాలు వెనక్కి ఇవ్వండి: లెక్చరర్లకు నోటీసులు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738980036205_782-normal-WIFI.webp)
AP: డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు 2019లో తీసుకున్న 2నెలల జీతాలు వెనక్కివ్వాలని విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ కాంట్రాక్ట్ జూ.లెక్చరర్ల తరహాలో తమకు జీతమివ్వాలని డిగ్రీ కా.లెక్చరర్లు విన్నవించారు. ఆ మేరకు రాష్ట్రంలోని 600మందికి APL, మే నెలలకు గానూ 51రోజుల జీతాలందాయి. ఇలా తీసుకుంటే దాన్ని అదనంగా పరిగణించి జీతాలు వెనక్కి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
Similar News
News February 8, 2025
ఢిల్లీ సచివాలయంలో ఆంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720797697-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో AAP ఓటమి ఖాయమైంది. దీంతో సచివాలయంలో ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఏ ఒక్క ఫైల్ కూడా అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేయడం, తాము అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో తాజా ఆదేశాలు కీలకంగా మారాయి.
News February 8, 2025
ముగ్గురు పిల్లల్ని కనండి.. హిందువులకు VHP పిలుపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738974638003_695-normal-WIFI.webp)
ప్రస్తుత జనన రేటు(1.9 శాతం) ప్రకారం హిందూ జనాభా తగ్గుతూనే ఉంటుందని VHP జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ చెప్పారు. జనాభా అసమతుల్యతను అధిగమించేందుకు ప్రతి హిందూ జంట ఇద్దరు/ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలన్నారు. కుటుంబాలు విడిపోవడం పిల్లలు, యువతలో అభద్రతకు కారణమవుతోందని తెలిపారు. హిందూ సంప్రదాయాలు పాటించడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు.
News February 8, 2025
RESULTS: ఇప్పటివరకు ఎవరికి ఎన్ని సీట్లు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739002384536_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 19 చోట్ల విజయం సాధించగా మరో 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు అవసరం. కానీ ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే కాషాయ పార్టీ అంతకుమించిన స్థానాల్లో గెలుపొందేలా కనిపిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్, సిసోడియా ఓటములతో చతికిలపడ్డ ఆప్ 8 చోట్ల గెలుపొందింది. మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.