News February 8, 2025
అనకాపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.
Similar News
News March 1, 2026
రబీ జొన్న పంటలో ఎదుగుదల లోపించిందా?

చలి, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా రబీలో నాటిన జొన్న పంట ఎదుగుదల కొన్నిచోట్ల లోపించినట్లుగా కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి లీటరు నీటికి 19-19-19 మిశ్రమాన్ని 5గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అలాగే జొన్న పంటలో ఒకవేళ కత్తెర పురుగును గుర్తిస్తే లీటరు నీటికి క్లోరాంట్రానిప్రోల్ 0.4ml లేదా స్పైనటోరమ్ 0.5ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 1, 2026
కలలో చీపురు కనిపిస్తే..

కలలు సాధారణం. అయితే అందులో చాలా వస్తువులు కనిపిస్తాయి. వాటిపై అనేక అపోహలుంటాయి. అందులో చీపురు ఒకటి. అది కనిపిస్తే అశుభమని భయపడతారు చాలామంది. కానీ అది పొరపాటని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ‘చీపురు లక్ష్మీదేవి స్వరూపం. కలలో చీపురు కనిపిస్తే దరిద్రం తొలగిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఇది జీవితంలో రాబోయే సానుకూల మార్పులకు సూచిక. ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది’ అని వివరిస్తున్నారు.
News March 1, 2026
ఇరాన్ అగ్రనాయకత్వాన్ని హతం చేశాం: ఇజ్రాయెల్

అమెరికాతో కలిసి జరిపిన దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్, నెతన్యాహు వెల్లడించారు. రక్షణ మంత్రి అజీజ్, సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ షిరాజీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలీ షంఖానీ, IRGC చీఫ్ మహమ్మద్ పక్‌పౌర్, SPND ఛైర్మన్ హోస్సేన్ జబల్, SPND మాజీ ఛైర్మన్ మొజాఫరీ, అలన్బే కమాండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సలేహ్ అసాదీ హతమయ్యారు.


