News February 8, 2025
కేజ్రీవాల్ వెనుకంజ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూ ఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డారు. అలాగే కాల్కాజీ నుంచి బరిలో నిలిచిన ఢిల్లీ సీఎం ఆతిశీ, జంగ్‌పుర నుంచి పోటీలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ట్రయలింగ్‌లో ఉన్నారు.
Similar News
News December 26, 2025
COEకి శ్రేయస్.. న్యూజిలాండ్ సిరీస్‌కి రెడీనా?

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్(ODI) శ్రేయస్ అయ్యర్ ఇవాళ బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(COE)కు వెళ్లారు. OCT 25న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. నాలుగు నుంచి ఆరురోజుల వరకు వైద్యులు అయ్యర్ హెల్త్‌ని అసెస్ చేసి అతని కంబ్యాక్‌ని డిసైడ్ చేస్తారు. ఇటీవల బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించిన అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్‌కు అందుబాటులోకి వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
News December 26, 2025
బిందు సేద్యం.. ఈ జాగ్రత్తలు తీసుకుందాం

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్‌లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్‌లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్‌ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.
News December 26, 2025
రేపే రాజాసాబ్ ‘ప్రీ రిలీజ్’ ఈవెంట్

మారుతీ-ప్రభాస్ కాంబోలో రాజాసాబ్ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్‌కు మూవీ టీమ్ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. HYDలో రేపు సా.5 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.


