News February 8, 2025
మెదక్: సభల ఏర్పాటుపై అధికార, ప్రతిపక్ష పార్టీల ఫోకస్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారీ సభలు పెట్టి బలప్రదర్శన చేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ భావిస్తున్నాయి. ఇందుకు ఉమ్మడి మెదక్ జిల్లాను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ త్వరలో భారీ బహిరంగ సభ పెట్టుకుందామని ప్రకటించగా, ఈ మేరకు గజ్వేల్ లేదా నర్సాపూర్‌లో ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ సభకు ధీటుగా జోగిపేట లేదా గజ్వేల్‌లో సభ పెట్టాలని అధికార కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
Similar News
News March 22, 2026
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

TG: సిద్దిపేట పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా స్కీమ్ నిధులు విడుదల చేశారు. 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ₹3,600 కోట్లను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో రేపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. 45 రోజుల్లో 3 విడతల్లో రూ.9వేల కోట్లు అకౌంట్లలో జమ చేయనున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.
News March 22, 2026
GK: ప్రపంచంలో అతి చిన్నవి

⋆ సముద్రం: ఆర్కిటిక్ (విస్తీర్ణం 14.05M చ.కి.మీ)
⋆ దేశం: వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ వైశాల్యం)
⋆ ఖండం: ఆస్ట్రేలియా (7.7-8.6M చ.కి.మీ వైశాల్యం)
⋆ పక్షి: బీ హమ్మింగ్‌బర్డ్ (5-6cm పొడవు, 2gms కంటే తక్కువ బరువు)
⋆ నది: US మాంటానాలో ఉన్న’రో’ నది (పొడవు 61m)
⋆ అతి చిన్న పుష్పం గల చెట్టు: ఉల్ఫియా ఆంగుస్టా
➜ రోజూ సా.5 గంటలకు GK బిట్స్
News March 22, 2026
కావలి: ఆ బోట్ల విడుదల వెనకున్న నేత ఎవరు..?

కొన్ని నెలల నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉన్న ఆ బోట్లను విడిపించడంలో కీలకంగా వ్యవహరించిన నేత ఎవరు? ఆయనకు దాని వలన వచ్చే లాభం ఏమిటనేది ప్రస్తుతం జిల్లాలో ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో ఎంపీ బీద మస్తాన్ రావు వీడియో షేర్ చేసి క్లారిటీ ఇవ్వగా.. ఇంత గొడవ జరిగినా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పందించలేదని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల తీర ప్రాంత సమస్య కావడంతో ఈ విషయం సమస్యాత్మకంగా మారుతోంది.


