News February 8, 2025
వికారాబాద్: తొమ్మిదేళ్ల విద్యార్థినిపై అత్యాచారం

తొమ్మిదేళ్ల విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ మండలంలోని ఓ గ్రామంలో బాలికపై వరుసకు మామ అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి నిందితుడు జంగయ్యను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. అతడిని కోర్డులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.అతడిని శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News November 10, 2025
నేటి నుంచి ‘స్వామిత్వ’ గ్రామసభలు

APలో <<18165882>>స్వామిత్వ<<>>(SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలకు అర్హులైన యజమానులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ముందు అభ్యంతరాలకు స్వీకరణ చేయనుంది. ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 22 వరకు గ్రామ సభలు నిర్వహించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.
News November 10, 2025
మీరు ఈరోజు జైనథ్ వెళ్తున్నారా..?

జైనథ్‌లో నల్లరాతితో నిర్మితమైన లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం ఆకట్టుకుంటోంది. శిలాశాసనాలు, అద్భుతమైన శిల్పాలతో నిర్మితమైన ఈఆలయం 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం మధ్య కాలానికి చెందినదని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. ఆలయ గోడలపై చెక్కిన 20 శ్లోకాలు, జైన సంప్రదాయానికి సంబంధించిన చిహ్నాలు చరిత్రప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. నేడు ఇక్కడ స్వామివారి రథోత్సవానికి వేలాదిగా భక్తులు వస్తారు. మీరు వెళ్తున్నారా?
News November 10, 2025
చీపుర పుల్లల కోసం వెళ్లి.. మృతి

బల్లికురవ మండలం సురేపల్లిలోని కొండ మీదకు రామాంజనేయులు(65) ఆదివారం చీపుర పుల్లల కోసం వెళ్లి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన గొర్రెల కాపరులు, స్థానికులు 108కు సమాచారం అందించారు. కొండ మీద నుంచి అతనిని కిందకు తీసుకొస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


