News February 8, 2025

27 ఏళ్ల బీజేపీ కరవు తీర్చిన ₹12L ట్యాక్స్ మినహాయింపు!

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కమలం గెలుపు దాదాపు ఖాయమేనని విశ్లేషకుల అంచనా. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మిడిల్ క్లాస్‌ను బీజేపీ వైపు తిప్పిందని పేర్కొంటున్నారు. అలాగే పదేళ్ల ఆప్ పాలనపై వ్యతిరేకత, కాంగ్రెస్ ఓట్లు చీల్చడం కూడా కలిసొచ్చిందని చెబుతున్నారు.

Similar News

News February 8, 2025

ఢిల్లీ ఫలితాలపై పవన్ ఏమన్నారంటే?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.

News February 8, 2025

0..0..0: ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ డకౌట్

image

దేశ రాజధాని ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 40% ఓటుషేర్ సంపాదించేది. మాజీ CM షీలాదీక్షిత్ నాయకత్వంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న పార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా మూడో సారీ ఖాతా తెరవకుండా హ్యాట్రిక్ డకౌట్ రికార్డు ఖాతాలో వేసుకుంది. క్రితంసారి 3% ఓటుషేర్ సాధించిన హస్తం పార్టీ ఈసారి 7 శాతంతో ఆనందపడాల్సి వస్తోంది. ఆ పార్టీ దుస్థితిపై మీ కామెంట్.

News February 8, 2025

బీజేపీ ఘన విజయం

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 36 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మరో 11 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. అటు ఆప్ 19 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.

error: Content is protected !!