News February 8, 2025

శ్రీశైల జలాశయం నుంచి 6,249 క్యూసెక్కుల నీరు విడుదల

image

శ్రీశైల జలాశయం బ్యాక్ వాటర్ నుంచి గడిచిన 24 గంటల వ్యవధిలో 6,249 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్‌కు 1,560 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆవిరి రూపంలో 272 c/s లాస్ అయింది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 852 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 84.4800 టీఎంసీలుగా నమోదైంది.

Similar News

News November 9, 2025

రూ.2 వేలు కడితే.. రూ.18,500 ఇస్తామని మెసేజ్‌లు

image

అమాయకులను లక్ష్యంగా చేసుకొని వాట్సాప్‌లో కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. రూ.2వేలు కట్టండి, రూ.18,500 జమ చేస్తాం అనే ఆఫర్‌తో మహిళలు, విద్యార్థులను గ్రూపుల్లో యాడ్ చేసి ఎర వేస్తున్నారు. చెల్లింపుల స్క్రీన్‌షాట్లు, పోలీసుల్లా మెసేజ్‌లు పెట్టి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మోసాలపై సైబర్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

News November 9, 2025

జూబ్లీ బైపోల్: ఓటర్లు, పోలింగ్ బూత్‌ల వివరాలు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎల్లుండి జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య: 4,01,365. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 226 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద రెండంచల భద్రత ఏర్పాటు చేస్తారు. ఉప ఎన్నికలో 58 అభ్యర్థులు(+నోటా) పోటీ చేస్తున్నారు. INC-BRS-BJP మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది.