News February 8, 2025
జనగామ: టాప్ ర్యాంకే లక్ష్యంగా ‘విజయోస్తు’!

పదో తరగతి పరీక్షల్లో జనగామ జిల్లా టాప్ ర్యాంకే లక్ష్యంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ‘విజయోస్తూ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.జనగామలో పలు పాఠశాల విద్యార్థులకు రూ.6 లక్షల స్మార్ట్ మెటీరియల్స్ అందించి డీఈవో రమేశ్ నేతృత్వంలో స్పెషల్ క్లాసులు, సబ్జెక్టుల వారీగా రివ్యూ, రోజువారీ టెస్టులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 140 ప్రభుత్వ పాఠశాలల్లో 4,578 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు.
Similar News
News March 10, 2026
ట్యాంక్ బండ్‌పై త్వరలో ‘బహుజన బిడ్డ’ విగ్రహం..!

తెలంగాణ గడ్డ గర్వించదగ్గ వీరపుత్రుల్లో ఒకరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం త్వరలో ట్యాంక్ బండ్ సమీపంలోని BPP ఆఫీస్ దగ్గర మెరవనుంది. ఎందరో మహానుభావుల సరసన ఈ మట్టి బిడ్డ నిలువెత్తు విగ్రహం కొలువుదీరనుండటం మన ఆత్మగౌరవానికి ప్రతీక. సుమారు రూ.3.18 కోట్ల అంచనాతో, కేవలం 5 నెలల్లో ఈ నిర్మాణం పూర్తికానుందని HMDA అధికారులు తెలిపారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన పాపన్న మనందరికీ గర్వకారణం.
News March 10, 2026
USకు జెలెన్‌స్కీ సాయం.. కాలం కలిసి రావడం అంటే ఇదే!

‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి’ అన్నట్లు జియోపాలిటిక్స్ మారిపోయాయి. ఏడాది క్రితం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీని ఎగతాళి చేసిన ట్రంప్ ఇప్పుడు అదే ఉక్రెయిన్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇరాన్ డ్రోన్లతో అమెరికా రక్షణ వ్యవస్థలు దెబ్బతింటుంటే వాటిని కూల్చడంలో ఆరితేరిన ఉక్రెయిన్ నైపుణ్యం ఇప్పుడు USకు అవసరమైంది. మిస్సైళ్ల కోసం అర్థించిన జెలెన్‌స్కీ నేడు అమెరికాకు రక్షణ వ్యవస్థ అందించే స్థాయికి చేరారు.
News March 10, 2026
ప.గో: అదనపు కట్నం వేధింపులు.. భర్తతో సహా నలుగురిపై కేసు

అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్త, మరిది, మరదలుపై నరసాపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. లుటుకుర్తి రాజేశ్‌కు స్వరూపతో 2020లో వివాహమైంది. అప్పటి నుంచి రాజేశ్ అదనపు కట్నం తేవాలని, అనారోగ్యంతో ఉన్న పిల్లాడి వైద్యానికి కూడా డబ్బులు పంపకుండా, గల్ఫ్‌లో ఉంటూ భర్త వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేశారు.


