News March 19, 2024
ఓయూలో దరఖాస్తుల స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల ఫార్మ్ డీ, ఆరేళ్ల ఫార్మ్ డీ కోర్సులతో పాటు దూరవిద్యా విధానంలో అందించే ఎంసీఏ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News March 7, 2026
పోలీసులు భాగస్వాములు కావాలి: మెదక్ అదనపు ఎస్పీ

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పోలీసులు భాగస్వాములు కావాలని అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు సురక్షితంగా చేరుకోండి (Arrive Alive) కార్యక్రమం హోం, రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల అమలు, హెల్మెట్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
News March 7, 2026
మెదక్: పరేడ్ పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్

మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్‌లో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ పాల్గొని, పోలీసు సిబ్బంది అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించి పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై సూచనలు చేశారు. పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలనతో పాటు సిబ్బంది మధ్య సమన్వయం (కోఆర్డినేషన్) పెరుగుతుందని తెలిపారు.
News March 7, 2026
MDK: నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య

మెదక్ జిల్లా తూప్రాన్‌కి చెందిన తాపీ మేస్త్రి తిమ్మాపురం సత్యనారాయణ (55) అనారోగ్యం కారణంగా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగ్గా, ఇటీవల పక్షవాతం (పెరాలసిస్) బారిన పడ్డారు. శారీరక ఇబ్బందులతో నొప్పి తట్టుకోలేక శనివారం ఇంట్లో ఉరివేసుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


